వెంకటరెడ్డిది హత్యేనన్న అమెరికా పోలీసులు

Publish Date:Jan 1, 2013

Advertisement

 

 

 

గత ఆదివారం అమెరికాలోని సిన్సినాటి లో మరణించిన గోలి వెంకట రెడ్డి (47) ది హత్యేనని అమెరికా పోలీసులు తేల్చారు. కరీం నగర్ కు చెందిన ఆయన తన స్నేహితుల సహాయంతో ఆ ప్రాంతంలో ఓ మద్యం షాపు నడుపుతున్నారు. దుండగులు ఆయన నోటిలో రివాల్వర్ పెట్టి కాల్చినట్లు సమాచారం.


స్థానిక పోలీస్ అధికారులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఈ హత్యఫై దర్యాప్తు ప్రారంభించామని, అయితే ఇంత వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని అన్నారు.



ఆయనను కాల్చి చంపిన అనంతరం షాపులో ఉన్న డబ్బును దుండగులు ఎత్తుకు వెళ్ళినట్లు రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృత దేహాన్ని చూసిన వెంటనే అందరూ దానిని అనుమానాస్పద మృతిగా భావించారు. రెడ్డి మృత దేహాన్ని ఇంత వరకూ ఆయన భార్య, బిడ్డలకు కూడా చూపించలేదని ఆయన కుటుంబ సభ్యులు అన్నారు. ఆయన ఇల్లు, షాపుల సమీపంలోని అనుమానాస్పద వ్యక్తులను ఒక్కొక్కరినీ గంట సేపు అక్కడి పోలీసులు ప్రశ్నించారు.

 

By
en-us Political News

  
రాప్తాడు బాలిక లక్ష్మి సాహసానికి గుర్తింపు.. చదువుకు అండగా ఆనంద్ మహీంద్రా.!
ఆచార్య ఎన్.జి. రంగా 127వ జయంతి సందర్భంగా జమీన్ రైతు పత్రిక సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌కు ఆచార్య ఎన్.జి. రంగా పురస్కారం ప్రదానం చేశారు.
ప్రస్తుతం అనంతపురంలో ఉన్న కియా తయారీ కేంద్రానికి ఏటా   3 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయితే, ఈ తాజా   పెట్టుబడి ద్వారా ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత భారీగా పెంచాలని కియా లక్ష్యంగా పెట్టుకుంది.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా,  సజావుగా పూర్తి చేసేందుకు వీలుగా మూడు దశలలో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించినట్లు పేర్కొంది.  ఇందు కోసం దశలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను నవంబర్ 13, రెండో విడత నోటిఫికేషన్ ను నవంబర్ 18న, ఒక  మూడో విడత నోటిఫికేషన్‌ను నవంబర్ 19వ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది. 
  4 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు  19 మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ఉన్నాయి. గతంలో కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. 
నష్టంపై సమీక్షించిన సీఎం చంద్రబాబు.. కేంద్రానికి సమగ్ర నివేదిక.!
హరిత మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.!
రాప్తాడు  ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది.
జగన్ హయాంలో చెవిరెడ్డి నుంచుంటే మాస్, కూర్చుంటే మాస్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. చంద్రగిరి నియోజకవర్గంలో ఏకపక్ష అరాచకాలు, బెదిరింపు రాజకీయాలతో చెలరేగిపోయేవారు. అటువంటి   చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి.. పరిషత్ పోలింగ్ వేళ చుక్కలు చూపించారు పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డి.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తు,  విచారణను ఆంధ్రప్రదేశ్ పరిధి నుంచి ఇతర రాష్ట్రాలకు మార్చాలన్న ఆ పిటిషన్ ను  విచారణ చేపట్టిన  సీజేఐ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసు  విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేయాల్సిన అవసరం కుండబద్దలు కొడుతూ, .  పిటిషన్‌ను కొట్టివేసింది.
కీలకమైన జడ్పీటీసీ స్థానాల్లో  వైసీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వీరు అనూహ్యంగా చివరి క్షణంలో పోటీ నుంచి వైదొలగడం వైసీపీకి తేరుకోలేని ఎదురుదెబ్బగా పరిణమించింది.  కడప జిల్లా మైదుకూరు,  అన్నమయ్య జిల్లా చిన్నమండెం జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి వైకాపా అభ్యర్థులు రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది.  
ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, రాబోయే పరిషత్ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలని  పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మించిపోయేలా  94 శాతం స్ట్రైక్ రేట్‌  దాటాలన్న టార్గెట్ నిర్దేశించారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న తెలుగుదేశం  శ్రేణులకు, వైసీపీ కార్యకర్తలకు  వాగ్వాదం చెలరేగింది. క్షణాల వ్యవధిలో ఈ వివాదం  ముదిరి ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘర్షణ సందర్భంగా పెట్రోలు బాంబులతో దాడి జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.